హుస్సేన్ సాగర్ శుద్ధికి సన్నాహాలు

April 21, 2018


img

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయడానికిచేస్తున్న ప్రయత్నాలలో కదలిక వచ్చింది. ఆ పనికోసం హెచ్.ఎం.డి.ఏ. గ్లోబల్ టెండర్లు పిలువగా మొత్తం 6 కంపెనీలు పోటీ పడ్డాయి. వాటిలో 3 విదేశీ కంపెనీలుకాగా, 2 హైదరాబాద్, ఒకటి బెంగళూరుకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ప్రక్షాళన కార్యక్రమం ఏవిధంగా చేస్తామో వివరించేందుకు ఒక్కో సంస్థ ప్రతినిధులు అధికారులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. వారిచ్చిన ఆ వివరాలపై హెచ్.ఎం.డి.ఏ. ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఈపీటీఆర్‌ఐ) అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు అధ్యయనం చేసి, తమ అభిప్రాయాలూ తెలియజేస్తూ ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక ఈయనున్నారు. వారి నివేదిక ఆధారంగా ఆ ఏడు కంపెనీలలో ఏదో ఒక దానికి ఈ పని అప్పగించవచ్చు. 

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీల పేర్లు: కె.ఎన్‌.బయో సైన్స్‌ (హైదరాబాద్), క్యాపిటల్‌ ప్రాజెక్టు (హైదరాబాద్), ఎన్‌కాఫ్‌ ( బెంగళూరు), బయో క్లీనర్‌ (కాలిఫోర్నియా), మ్యాట్రిక్స్‌ (కెనడా), బయోఫామ్‌ (చైనా).



Related Post