తెలంగాణాకు ఎయిమ్స్ మంజూరు

April 21, 2018


img

ఆల్ ఇండియా మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్) ఆసుపత్రి ఏర్పాటుకు తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన నిధులు అందిస్తామని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దీనికి సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్) రూపొందించి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్థలం సమకూర్చవలసి ఉంటుంది. కనుక దీని కోసం షామీర్ పెట్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో, శంషాబాద్, ఘటకేసర్ వద్ద మూడు స్థలాలను అధికారులు గుర్తించారు. ఇవికాక బీబీనగర్ లోగ నీమ్స్ ఆసుపత్రి భవనలను కూడా పరిశీలించారు. కనుక ఈ నాలుగు ప్రాంతాలలో ఏదో ఒక దానిని ఎంపికచేసే అవకాశం ఉంది. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి స్థలాలు గుర్తింపు కూడా పూర్తయింది కనుక డిపిఆర్ రూపొందించడమే ఆలస్యం, ఆసుపత్రి నిర్మాణం మొదలుపెట్టవచ్చు. 



Related Post