అయన తన సీటే గెలుచుకోలేడు: హరీష్ రావు

April 20, 2018


img

ప్రొఫెసర్ కోదండరాం..అయన స్థాపించిన టిజెఎస్ పార్టీ గురించి మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రొఫెసర్ కోదండరాం ఏదో ఒకరోజు రాజకీయాలలోకి వస్తారని మేము ఏడాదిన్నర క్రితమే ఊహించాము. ఆ ఉద్దేశ్యంతోనే అయన ఇంతకాలం టిజెసిని కొనసాగించారు. తమ పార్టీ ఒంటరిగా 119 సీట్లకు పోటీ చేస్తుందని అయన చెపుతున్నారు కానీ మా ఊహ నిజమైతే అయన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని 4-5 సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టవచ్చు. అంతే! కనుక టిజెఎస్ ను చూసి మేము భయపడనవసరం లేదు. అది అసలు మాకు పోటీయే కాదు. ఇక ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా తన సీటునే గెలుచుకోలేరని నేను ఖచ్చితంగా చెప్పగలను. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని కలిసి మాతో పోటీ చేసినా కూడా మేమే గెలుస్తామని ఖచ్చితంగా చెప్పగలము. ఇక కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు రాష్ట్రాన్ని పర్యటించి మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను మెచ్చుకొంటుంటే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయి. అయితే ఎవరు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికలలో ప్రజలు మాకే ఓట్లు వేసి గెలిపిస్తారు,” అని మంత్రి హరీష్ రావు అన్నారు. 


Related Post