ఎన్నికల కమీషన్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

April 20, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం డిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓపి.రావత్ ను కలిసి తమ శాసనసభ్యత్వలను పునరుద్దరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సబంధించి పూర్తి వివరాలు ఆయనకు తెలియజేసి, తెరాస సర్కార్ రాజకీయ కక్షసాధించడానికే తమ  సభ్యత్వాలను రద్దు చేసిందని పిర్యాదు చేశారు. రాజ్యాంగ విరుద్దంగా తమ శాసనసభ్యత్వాలను రద్దు చేసిన తెరాస సర్కార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వారిరువురూ హైకోర్టు తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల కమీషనర్ కు సమర్పించడంలో తప్పు లేదు. కానీ ఈ కేసుపై పునర్విచారణ చేయాలని కోరుతూ 12మంది తెరాస ఎమ్మెల్యేల చేత తెరాస సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచిలో ఒక రిట్ పిటిషన్ వేసింది. కనుక ఈ కేసు మళ్ళీ మొదలవబోతోంది. దీనిపై డివిజన్ బెంచ్ ఏవిధంగా తీర్పు చెపుతుందో చూడాలి. ఒకవేళ అది కూడా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే సమర్ధిస్తే తెరాస సర్కార్ కు, వ్యతిరేకిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.  



Related Post