మన కాళేశ్వరం నెంబర్:1

April 16, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. మొన్న శనివారం ఒక్కరోజునే ఏకంగా 7,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. గత ఏడాది డిసెంబర్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటించినప్పుడు రోజుకు 1,169 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతుండేవి. ఈ ఏడాది వర్షం కాలం ప్రారంభంకాగానే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తప్పనిసరిగా నీళ్ళు పంపించాలని, కనుక అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్ట్ కంపెనీలను ఆదేశించడంతో కాంక్రీట్ పనులు జోరందుకొన్నాయి. 

ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనకు మునుపు మొత్తం 77,946 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగగా, డిసెంబర్ నుంచి మొన్న శనివారం వరకు అంటే 5నెలల వ్యవధిలో  5,39,361 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. శనివారం ఒక్కరోజునే మేడిగడ్డలో 7,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. ఇక అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, మూడు పంప్ హౌసులలో కలిపి రోజుకు 20,000  క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. 

ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలు, వివిధ ప్రభుత్వశాఖలు, అధికారులు అందరూ చక్కటి సమన్వయంతో పనిచేస్తునందునే ఇంతవేగంగా పనులు సాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. గత డిసెంబర్ నుంచి రోజూ ఇంచుమించు ఇదేవేగంతో కాంక్రీట్ పనులు జరుగుతుండటంతో అనుకొన్న సమయం కంటే ముందుగానే ప్రాజెక్టు పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆసియా దేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టు నెంబర్: 1 ప్రాజెక్టుగా నిలువబోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. Related Post