నేడు ఏపి బంద్

April 16, 2018


img

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర బంద్ జరుగబోతోంది. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు, విభజన హామీలు అమలుచేయనందుకు నిరసనగా ప్రత్యేకహోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు రాష్ట్రం తెదేపా, భాజపాల తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కనుక సంపూర్ణంగా బంద్ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు జరుగబోయే బంద్ కు మద్దతుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోమవారం ఒక్కరోజు తన పాదయాత్రను విరామం ప్రకటించారు. మళ్ళీ మంగళవారం నుంచి యధాప్రకారం పాదయాత్ర చేస్తారని వైకాపా ప్రకటించింది.   Related Post