ఉత్తమ్ కుమార్ సంచలన నిర్ణయం?

April 14, 2018


img

తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకొన్నట్లు తాజా సమాచారం. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలనే రాహుల్ గాంధీ సూచనల మేరకు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజీనామాలు చేయాలని కోరినట్లు తాజా సమాచారం. జిల్లా అధ్యక్షులుగా పదవిలో కొనసాగుతూ మళ్ళీ పార్టీ టికెట్ ఆశించవద్దని, టికెట్ కావాలనుకొంటే డిసిసి అధ్యక్ష పదవులకు రాజీనామాలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయన సూచనల మేరకు ఇంతవరకు ఏడుగురు  తమ పదవులకు రాజీనామాలు చేసి ఆ లేఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినట్లు సమాచారం. ఈ రాజీనామాల తంతు పూర్తయిన తరువాత డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. Related Post