పేద వధువులకు శుభవార్త

March 19, 2018


img

తెలంగాణాలో పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో ఒక్కొక్కరికీ రూ51,000 ఆర్ధిక సహాయం అందించేది. తరువాత దానిని రూ. 75,116కు పెంచింది. తాజాగా దానిని రూ.1,00,116లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో పెళ్ళి రోజున లేదా కొన్ని రోజుల ముందుగానే అందజేయాలన్న మంత్రి జోగురామన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు. తద్వారా ఆ డబ్బు అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మానవతా దృక్పధంతో తీసుకొంటున్న ఇటువంటి నిర్ణయాలే ప్రజలలో అయనకు నానాటికీ ఆదరణపెరిగేలా చేస్తున్నాయి. ఆ ప్రజాధారణే తెరాసకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. 



Related Post