తెరాస కూడా అవిశ్వాసమే!

March 16, 2018


img

తెరాస కీలక నిర్ణయం తీసుకొంది. ఒకవేళ తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్ సభలో అనుమతిస్తే, తెరాస ఎంపిలు కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ప్రకటించారు. అయితే సభ నడపడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే వైకాపా, తెదేపాల అవిశ్వాస తీర్మానాలపై చర్చకు సభలో అనుమతించగలనని చెప్పి స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభ సమావేశాలను రేపటికి వాయిదా వేసి ముగించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా ఉభయసభలు సజావుగా సాగలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంపిలతో పాటు, వివిధ రాష్ట్రాల ఎంపిలు సభలో ఆందోళన చేస్తునందున, బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా ఎటువంటి చర్చ జరుగాకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించేశారు. కనుక రేపు కూడా ఉభయసభలలో ఇటువంటి పరిస్థితులే నెలకొనవచ్చు కనుక అవిశ్వాస తీర్మానాలపై ఎటువంటి చర్చ జరుగాకుండానే పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినా ఆశ్చర్యం లేదు.   



Related Post