కెసిఆర్ మాటలు కెసిఆర్ కే!

March 16, 2018


img

గత మూడున్నరేళ్ళలో తెరాస సర్కార్ లక్షల కోట్లు అప్పులు చేసి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల ఊబిలోకి ముంచేసిందని ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో త్రిప్పికొడుతూ గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణా ఏర్పడక మునుపు సుమారు 70,000 కోట్లు అప్పులు ఉండగా ఈ మూడున్నరేళ్ళ అవి రూ.1.40 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. కనుక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తమ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేయలేదని కేవలం రూ.70,000 కోట్లు మాత్రమే అప్పు తీసుకొన్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. 

మళ్ళీ దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. ‘గత 50 ఏళ్ళలో సమైక్య రాష్ట్రాన్ని ఏలిన అన్ని ప్రభుత్వాలు కలిపి కేవలం రూ.70,000 కోట్లు మాత్రమే అప్పు చేయగా, తెరాస సర్కార్ కేవలం మూడున్నరేళ్ళలోనే రూ.70,000 కోట్లు అప్పులు చేసిందని స్పష్టమైంది. ఇన్నివేల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది,” అని ఎద్దేవా చేశారు. 

కెసిఆర్ నోటితోనే తెరాస సర్కార్ చేసిన అప్పుల గురించి చెప్పుకొనేలా చేసి విమర్శించడం కాంగ్రెస్ రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే, రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం బారీగా నిధులు అవసరం ఉంటుంది కనుక వాటి కోసం అవసరమైన రుణాలు తెచ్చుకోవడం తప్పు కాదని అందరికీ తెలుసు.          



Related Post