ముఖ్యమంత్రిపై జైపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు

March 15, 2018


img

కాంగ్రెస్ శాసనసభ్యుల సస్పెన్షన్, ఇద్దరి సభ్యత్వం రద్దుపై మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ సభ్యులపై ఇంత కటినమైన చర్యలు తీసుకోవడం తెలివితక్కువపని అని అన్నారు. కెసిఆర్ యొక్క ఇటువంటి నియంతృత్వ వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలు అందరూ అసహ్యించుకొంటున్నారని, ఆ కారణంగా వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, సమస్యలపై నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్ళించడానికే కెసిఆర్ హటాత్తుగా ధర్డ్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని, వాటిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కూడా తధ్యమని జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతే తమ పార్టీకి ఎంతో మేలు చేయబోతోందని జైపాల్ రెడ్డి అన్నారు. 



Related Post