ఆధార్ లింకేజి...నో డెడ్ లైన్!

March 13, 2018


img

మొబైల్ ఫోన్స్, బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్స్ వగైరావగైరాలన్నిటినీ మార్చి 31వ తేదీలోగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి సమయం దగ్గర పడుతుండటంతో మళ్ళీ ప్రజలలో ఆందోళన మొదలైంది. దీంతో సుప్రీం కోర్టులో మళ్ళీ ఒక ప్రజాహిత వాజ్యం దాఖలైంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ దానిపై మంగళవారం విచారణ చేపట్టింది. అన్నిటినీ ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని ప్రజలను ఒత్తిడి చేయడం సరికాదని, దీనిపై ‘తుది తీర్పు వెలువడేవరకు’ ఎటువంటి డెడ్ లైన్లు విధించడానికి వీలులేదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కనుక ప్రజలు నిశ్చింతగా తమకు వీలున్నప్పుడు ఆధార్ తో అనుసంధానం చేసుకోవచ్చు. Related Post