ప్రతీకారం తీర్చుకొన్న మావోయిస్టులు

March 13, 2018


img

ఇటీవల తెలంగాణా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు భద్రతాదళాల చేతిలో హతం అయిన సంగతి తెలిసిందే. దానికి మావోయిస్టులు మంగళవారం ప్రతీకారం తీర్చుకొన్నారు. ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో కిస్తారాం రోడ్డు వద్ద మావోయిస్టులు కాపుకాసి సిఆర్.పి.ఎఫ్. 212 బెటాలియన్ వాహనలపి మెరుపు దాడి చేశారు. వారిదాడిలో 9మంది జవాన్లు అక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సుమారు వందమందికి పైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోతే గగ్గోలు పెట్టి హడావుడిగా కోర్టులలో పిటిషన్లు వేసే ప్రజాహక్కుల నేతలు ఈరోజు నోరు మెదపడం లేదు. మావోల దుశ్చర్యను ఖండించలేదు! వారి దృష్టిలో మావోయిస్టుల ప్రాణాలకున్న విలువ జవాన్ల ప్రాణాలకు లేదని భావించాలేమో?   Related Post