27వరకు బడ్జెట్ సమావేశాలు

March 13, 2018


img

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వరకు (12 రోజులు) నిర్వహించాలని బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 15వ తేదీన 2018-19 రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. దానిపై ఉభయసభలలో చర్చించి ఆమోదం పొందేవరకు ప్రభుత్వ రోజువారి నిర్వహణకు ఖజానా నుంచి అవసరమైన నిధులను ఉపయోగించుకొనేందుకు వీలు కల్పించే ద్రవ్యవినిమయ బిల్లుకు ఈనెల 27న ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి.   Related Post