గజ్వేల్ లో సిఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం

March 09, 2018


img

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు అందరూ తమతమ నియోజక వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ తమతమ నియోజకవర్గ కేంద్రాలలలో క్యాంప్ కార్యాలయాలు నిర్మించి ఇస్తోంది. వాటిలో మొట్టమొదటగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్ కోసం నిర్మించిన క్యాంప్ కార్యాలయాన్ని  మంత్రి హరీష్ రావు వేదపండితులతో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్ధిపేట జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Related Post