రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్

February 23, 2018


img

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో 58 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్-మే నెలలలో ముగియబోతునందున వాటిని భర్తీ చేసేందుకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో చెరో 3 స్థానాలున్నాయి. ఏపిలో చిరంజీవి (కాంగ్రెస్), దేవేందర్ గౌడ్ (తెదేపా), రేణుకా చౌదరి(కాంగ్రెస్), తెలంగాణా రాష్ట్రం నుంచి సి.ఎం.రమేష్ (తెదేపా), రాపోలు ఆనంద్ భాస్కర్ (కాంగ్రెస్), పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. ఆ స్థానానికి కూడా ఇప్పుడే ఎన్నికలు జరుగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. 

ఎన్నికల షెడ్యూల్: 

నోటిఫికేషన్: మార్చి 5, నామినేషన్స్ దాఖలుకు గడువు: మార్చి 12, పరిశీలన: మార్చి 13, ఉపసంహరణకు గడువు: మార్చి 15, పోలింగ్: మార్చి 23, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మార్చి 23,  ఈ ఎన్నికల ప్రక్రియకు ముగింపు తేదీ: మార్చి 26.

ఈ ఎన్నికలు శాసనసభ సభ్యుల కోటాలో జరుగబోతున్నాయి కనుక ఏపిలో తెదేపాకున్న శాసనసభ సభ్యుల సంఖ్యా బలం బట్టి 2, వైకాపాకు 1 స్థానం గెలుచుకొనే అవకాశం ఉంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో తెరాసకున్న శాసనసభ సభ్యుల బట్టి 2 స్థానాలను అవలీలగా గెలుచుకోగలదు. రెండు రాష్ట్రాలలో 3వ సీటును కూడా దక్కించుకోవడానికి తెరాస, తెదేపాలు పావులు కదపడం ఖాయంగానే కనిపిస్తోంది. 


Related Post