నిరుద్యోగులకు శుభవార్త!

February 23, 2018


img

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా నిరుద్యోగ యువతను వారి కుటుంబాలను ఆకట్టుకొంటుంది. కనుక తెరాస సర్కార్ కూడా ఆ దిశలో ఆలోచన చేయడం మొదలుపెట్టింది. వచ్చే ఆర్దికసంవత్సరం నుంచి నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారుల ముందుంచారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు?వారందరికీ నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తే ఖజానాపై ఎంత భారం పడుతుంది? దానిని అమలుచేయాలంటే ప్రభుత్వం ముందు ఏమేమి ఆదాయమార్గాలున్నాయి? మొదలైన వివరాలను సేకరించాలని ఆదేశించగా ఆర్ధికశాఖ అధికారులు అప్పుడే ఆ వివరాలు సేకరించే పని మొదలుపెట్టినట్లు తాజా సమాచారం. 



Related Post