వర్మకి 3.30 గంటల పోలీస్ సిన్మా!

February 17, 2018


img

వివాదాల రామ్ గోపాల్ వర్మ నోటికి అడ్డేలేదు..ఎదురేలేదన్నట్లు వ్యవహరిస్తుండేవారు. జనానికి నచ్చినా నచ్చకపోయినా...తిరస్కరిస్తున్నా సినిమాలు తీస్తుండేవాడు. ఇంతకాలం జనాలకు అయన సినిమాలు చూపిస్తుంటే, శనివారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనను స్టేషన్లో మూడున్నరగంటల పాటు సినిమా చూపించారు. 

వర్మ లాయరును వెంటబెట్టుకొని వచ్చినప్పటికీ పోలీసులు అతనిని మూడున్నర గంటలసేపు ఏకధాటిగా ప్రశ్నించి కానీ విడిచిపెట్టలేదు. మహిళలను కించపరిచే విధంగా జి.ఎస్.టి. అనే బూతు వెబ్ సిరీస్ తీయడం, దానిపై ఒక టీవీ షోలో జరిగిన చర్చా కార్యక్రమంలో అయన హైదరాబాద్ కు చెందిన ఒక మహిళతో అవహేళనగా మాట్లాడినందుకు రెండు వేర్వేరు పిర్యాదులు దాఖలయ్యాయి. ఆ కేసుల విచారణకు హాజరుకమ్మని పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించినప్పటికీ వర్మ హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. తప్పనిసరై వర్మ ఇవ్వాళ్ళ పోలీసుల ముందు హాజరయ్యారు. మళ్ళీ వారం రోజుల తరువాత మరోసారి విచారణకు రావలసిందిగా ఆదేశిస్తూ అతనిని విడిచిపెట్టారు. కానీ అతని సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

ఇంతకాలం అందరికీ నచ్చని సినిమాలు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రియల్ లైఫ్ సిన్మా టేస్ట్ ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. కనుక తాను చట్టాలకు, పోలీసులకు అతీతుడిననే భ్రమలో నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా గ్రహించి బుద్ధిగా మేసులుకొంటే మంచిది. కానీ అలా ఉంటే అతనికి ఇంత గుర్తింపు వచ్చేదే కాదు కనుక వర్మ మారకపోవచ్చు. ఒకవేళ ఈ కేసులలో జైలుకు వెళ్ళవలసివస్తే, బయటకు వచ్చిన తరువాత లోపలి జీవితం ఏవిధంగా ఉంటుందో చూపే సినిమా తీసినా ఆశ్చర్యం లేదు.     



Related Post