బెర్త్ ఎందుకు ఏకంగా బోగీనే బుక్ చేసుకోవచ్చు!

February 17, 2018


img

రైల్వేశాఖ చక్కటి నిర్ణయం తీసుకొంది. పెళ్ళిళ్ళు, తీర్ధయాత్రలకు ఆర్టీసి బస్సులు బుక్ చేసుకోగలుగుతున్నట్లే, ఇప్పుడు బోగీలు, ఏకంగా ప్రత్యేక రైలునే బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. నిజానికి ఈ సౌకర్యం చాలా కాలం నుంచే ఉన్నప్పటికీ, అది చాలా ఇబ్బందికరమైన విధానం ఉండేది. లేదా ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీలకు బారీగా సొమ్ము చెల్లించుకోవలసి వచ్చేది. కానీ ఇకపై ఐ.ఆర్.సి.టి.సి. వెబ్ సైట్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకొన్నట్లుగానే, బోగీలు, ప్రత్యేక రైళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బుకింగ్స్ పై అదనంగా 35 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. బోగీలు, లేదా ప్రత్యేక రైలు అవసరమనుకొన్నవారు ఆ మాత్రం అదనపు భారం భరించక తప్పదు.  



Related Post