టి.ఆర్.టి. హెల్ప్ డెస్క్

February 17, 2018


img

త్వరలో జరుగబోయే టీచర్స్ రిక్రూట్ మెంట్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధుల అనుమానాలు నివృతి చేయడం కోసం హైదరాబాద్, టి.ఎస్.పి.ఎస్.సి. కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న అభ్యర్ధులు నేరుగా టి.ఎస్.పి.ఎస్.సి. కార్యాలయానికి వచ్చి హెల్ప్ డెస్క్ లో సిబ్బందితో మాట్లాడి తమ అనుమానాలు నివృతి చేసుకోవచ్చు. ఇతర జిల్లాలలో నివసిస్తున్నవారు 83339 23740 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా helpdesk@tspsc.gov.in కు ఈమెయిల్ చేసి తమ అనుమానాలు నివృతి చేసుకోవచ్చు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఇది టి.ఆర్.టి. పరీక్షలు ముగిసేవరకు పని చేస్తుంది. 



Related Post