తెలంగాణా రధసారధి కెసిఆర్ జన్మదినం నేడు

February 17, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు ఈరోజు. అయన 1954, ఫిబ్రవరి 17న జన్మించారు. నేటితో 65వ సం.లో అడుగుపెట్టారు. అయన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెరాస మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా వారు చేపట్టబోతున్నారు.  

కెసిఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిది. కనుక అందరికీ అయన జీవితంలో పరిణామాల గురించి తెలుసు. 

దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు జరిగినప్పటికీ అందరికీ తెలిసిన కారణాల వలన తెలంగాణా ఏర్పాటు అసాధ్యమనే భావన సర్వత్రా నెలకొని ఉన్నప్పుడు, ప్రజలలో ఉద్యమకాంక్ష రగిలించి పన్నెండేళ్ళ పాటు అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.  

తెలంగాణా సాధించడంతో తన పని అయిపోయిందని అనుకోకుండా, దశాబ్దాలుగా విద్వంసానికి గురైన తెలంగాణాను ‘బంగారి తెలంగాణా’గా మార్చేందుకు కంకణం కట్టుకొని రేయింబవళ్ళు కృషి చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఆయన నిత్యచైతన్యంతో, విన్నూత్నమైన ఆలోచనలతో, అనితర సాధ్యమైన రాజకీయ చతురతతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పరితపిస్తూ ఆ దిశలో రాష్ట్రాన్ని నడిపిస్తూ అందరి ప్రశంశలు అందుకొంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రజల తరపున, దేశవిదేశాలలో ఉన్న తెలంగాణావాసుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది www.mytelangana.com. 


Related Post