కోదండరాం పార్టీ ఆవిర్భావ సభ మార్చి 10న

February 14, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకూడదనుకొన్నప్పటికీ కారణాలు ఏవైతేనేమి...ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేస్తున్నారు. దీనిపై ఆయన చాలా కాలం ఊగిసలాడినప్పటికీ, నిర్ణయం తీసుకొన్న తరువాత చాలా చురుకుగా ఏర్పాట్లు పూర్తి చేసుకొన్నారు. అయన అధ్యక్షతన ఏర్పాతుచేయబోతున్న పార్టీకి తెలంగాణా జన సమితి (టిజెఎస్) అనే పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఒకవేళ దీనిపై సాంకేతిక అవరోధాలు లేదా ఎవరి నుంచైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే, చివిరి నిమిషంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రజా పార్టీ,  తెలంగాణా సకల జనుల పార్టీ, ప్రజా తెలంగాణా పార్టీ అనే మరో మూడు పేర్లను టిజెఏసి నాయకుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అయితే తెలంగాణా జన సమితి (టిజెఎస్) రిజిస్ట్రేషన్ కు ఎటువంటి అవరోధాలు, అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నారు. కొత్త పార్టీ ఆవిర్భావ సభను మిలియన్ మార్చ్ జరిగిన మార్చి 10న హైదరాబాద్ లేదా వరంగల్ నగరాలలో నిర్వహించాలని భావిస్తున్నారు. అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ కార్యవర్గ సభ్యుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.    



Related Post