ఇది నిజమా?

February 13, 2018


img

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా మొదలైంది. 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తే, రైతులు విచ్చలవిడిగా బోరుబావుల నుంచి, పంట కాలువల నుంచి నీటిని తోడేస్తారని దాని వలన భూగర్భజలాలు తగ్గిపోతాయని ప్రతిపక్షాలు మొత్తుకొన్నాయి. కనుక పగలు 9 గంటలసేపు విద్యుత్ అందిస్తే సరిపోతుందని అవి సూచించాయి. కానీ 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామని గొప్పలు చెప్పుకొని ఇప్పుడు ఏ కారణాల చేత దానికి కొత్త విధించినా మళ్ళీ అదే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించకమానవు. కనుక వాటి విమర్శలను ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ వాటి వాదనలు నిజమని నిరూపిస్తూ రెండు నెలలోనే రాష్ట్రంలో అనేక గ్రామాలలో భూగర్భ జలాలు లెవెల్స్ పడిపోయాయని కిసాన్ ఖేత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఎమ్మెల్యే.కోదండ రెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్ ఫ్యాప్సీ భవన్ లో టి.ఎస్.ఈ.ఆర్.సి. బహిరంగ విచారణ జరిపింది. దానికి హాజరైన రైతు సంఘాల నాయకులుదొంతి నర్సింహా రెడ్డి, మాణిక్ రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు ఈవిషయాన్ని సాగునీటి శాఖ బల్వంత్ జోషి తదితర ధికారుల దృష్టికి తెచ్చారు. కొన్ని ప్రాంతాలలో భూగర్భ నీటి నిలువలు మళ్ళీ 1,000 అడుగుల కంటే దిగువకు పడిపోయాయని చెప్పారు. ఇంకా వేసవి మొదలవక మునుపే ఇటువంటి పరిస్థితి ఏర్పడితే, ఏప్రిల్, మే నెలలలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అవసరాలకు జరుగుతున్న భూసేకరణలో రైతులకు తగినంత నష్టపరిహారం సకాలంలో అందడం లేదని పిర్యాదు చేశారు.          Related Post