ఓటమి భయంతోనే పరోక్ష ఎన్నికలు: లక్ష్మణ్

January 18, 2018


img

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె లక్ష్మణ్ బుధవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “విద్యారంగంలో సుమారు 40,000 ఖాళీలు భర్తీ చేయకుండా, ప్రభుత్వ పాఠశాలలలో కనీస మౌలికవసతులు కల్పించకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించేస్తున్న తెరాస సర్కార్ కేంద్రాన్ని నిందించడం చాలా హాస్యాస్పదం. ఉన్నతవిద్య గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఉన్నత విద్యాసంస్థలను కుల,మత, రాజకీయ వేదికలుగా మార్చివేసింది. దక్షిణాది రాష్టాలలో అక్షరాస్యతలో తెలంగాణా అన్నిటికంటే వెనుకుండటం నిజం కాదా? తెరాస సర్కార్ చెసేది గోరంత చెప్పుకోనేది కొండంత. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చేసిందేమీ లేకపోయినా  దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణాలోనే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఓటమి భయంతోనే  పంచాయితీ ఎన్నికలలో పరోక్ష పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలనుకొంటోంది. తెరాస సర్కార్ ఎత్తులు, కుయుక్తులను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు దానికి వారు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం,” అని అన్నారు. 



Related Post