హజ్ సబ్సీడీ నిలిపివేతపై ఒవైసీ స్పందన

January 17, 2018


img

భారత్ నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలకు ఏటా అందిస్తున్న సబ్సీడిని నిలిపివేసి ఆ సొమ్మును నిరుపేద ముస్లిం బాలికల విద్యాభ్యాసానికి వినియోగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. “బుజ్జగింపులు లేకుండా ముస్లింలు సాధికారత సాధించేందుకు వేసిన తొలి అడుగు ఇది” అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.

దీనిపై మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. “హజ్ యాత్రకై ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్మును నిరుపేద ముస్లిం బాలికలకు విద్యనందించేందుకు ఖర్చు చేయాలని మా పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కనుక కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే హజ్ యాత్రపై చేస్తున్న ఖర్చును నిలిపివేసిన కేంద్రం అలహాబాద్, మధ్యప్రదేశ్ లో జరిగే కుంభమేళాపై వందల కోట్లు ఖర్చు చేయడం మానుకొంటుందా? ఆలయాల పునరుద్దరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. వాటిని కూడా ఆపుతుందా? ఆ ఖర్చులేవీ ఆపనప్పుడు అది ఓట్ల కోసం హిందువులను బుజ్జగించడం కాదా?” అని ప్రశ్నించారు.


Related Post