అభివృద్ధిలో పోటీ పడుతున్న వరంగల్ జిల్లాలు

January 12, 2018


img

హైదరాబాద్ తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు చెప్పుకోదగ్గవి. వరంగల్ గ్రామీణ (రూరల్) జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ రాబోతోంది. వరంగల్ పట్టణ (అర్బన్) జిల్లాలో హిందూస్తాన్ పెట్రోలియం గ్యాస్ ప్లాంట్ రాబోతోంది. అదిగాక ఐటి కంపెనీలు కూడా ఇప్పుడు వరంగల్ బాట పట్టాయి.  

వరంగల్ అర్బన్ జిల్లాలో కమలాపురం మండల పరిధిలో రూ.100 కోట్ల పెట్టుబడితో హిందూస్తాన్ పెట్రోలియం గ్యాస్ ప్లాంట్ నిర్మించబడుతోంది. దీనితో రాష్ట్రంలో చర్లపల్లి తరువాత రెండవ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లవుతుంది. డిసెంబర్ 2018లోగా ఈ ప్లాంట్ లో ఉత్పతి కార్యక్రమాలు మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్నందున ప్లాంట్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు 14,000 సిలిండర్లను నింపగల సామర్ధ్యంతో ఈ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా 300 టన్నుల గ్యాస్ ను నిలువచేయగలిగిన మూడు బారీ గ్యాస్ స్టోరేజి ట్యాంకుల నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయి. మరోపక్క గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం అయితే ఉభయ వరంగల్ జిల్లాలు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు ఇక్కడి నుంచే గ్యాస్ సిలిండర్ల సరఫరా మొదలవుతుంది. 


Related Post