హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టిబి రాధాకృష్ణన్

January 12, 2018


img

ఏపి, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ టిబి రాధాకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. ఇంతవరకు అయన ఛత్తీస్ ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుతో బాటు దేశంలో మరో నాలుగు రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీం కోర్టు కోలీజియం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇది వరకు ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ దిలీప్ బోసలే 2016, జూలై లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అవడంతో, అప్పటి నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో టిబి రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు స్వీకరిస్తారు. హైకోర్టు విభజన ప్రక్రియ పనులు మొదలవుతున్న సమయంలో ఈ నియామకం జరుగడం వలన నిర్ణయాలు తీసుకోవడంలో ఇక ఆలస్యం ఉండకపోవచ్చు.     Related Post