సంక్రాంతి కాదు ఉగాదికి ముహూర్తమట!

January 11, 2018


img

భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ మారబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై గురువారం స్పందించారు. అయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్ర భాజపా తీరు చాలా నిరుత్సాహపరిచేదిగా ఉంటోంది. తెరాస సర్కార్ అవినీతిని ఎండగట్టడంలో మా పార్టీ అలసత్వం ప్రదర్శిస్తోందని నా అనుచరులు, భాజపా కార్యకర్తలు భావిస్తున్నారు. ఇటువంటి నిరుత్సాహ వాతావరణం నెలకొన్న పార్టీలో ఇంకా కొనసాగవలసిన అవసరం ఉందా? అనే ఆలోచనమాలో మొదలైంది. ఉగాది పండుగ తరువాత పార్టీ మారడంపై ఒక నిర్ణయం తీసుకొంటాను,” అని అన్నారు.          Related Post