హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాలు ప్రారంభం

January 23, 2021
img

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాదులో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటలతో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, ఇంకా అనేకమంది ఉన్నతాధికారులు, స్థానిక టిఆర్ఎస్‌ నేతలలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 హైదరాబాద్‌, లాలాపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరుపేదల ప్రజల కోసం తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. దీనిలో అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్సరే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియాలజీ వంటి అధునాతనమైన పరీక్షలను కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ పరీక్షలకు ఎలాంటి రుసుమును చెల్లించిన అవసరం లేదని తెలిపారు. హైదరాబాద్‌లో మొత్తం 8 డయాగ్నొస్టిక్ సెంటర్లను నేడు ప్రారంభించారు.


ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ నిరుపేదల ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లకుండా ఈ కేంద్రాల్లోనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎనిమిది కేంద్రాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని త్వరలోనే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Related Post