నీమ్స్ ఆసుపత్రిలో కొవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌

October 26, 2020
img

కరోనా వైరస్ సోకకుండా నివారించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కొవాక్సిన్’ టీకాకు తొలి రెండు దశల ప్రయోగాలు విజయవంతంగా పూర్తవడంతో,అత్యంత కీలకమైన 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతించింది. కనుక ఈ వారంలోనే హైదరాబాద్‌ నీమ్స్ ఆసుపత్రిలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ముందుగా నీమ్స్ ఎథిక్స్ కమిటీ మంగళవారం సమావేశమయ్యి వీటికి సంబందించిన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత క్లినికల్ ట్రయల్స్‌ మొదలవుతాయి. 

వీటిలో భాగంగా మొదట 100-200 మంది వాలంటీర్లకు కొవాక్సిన్ ఇచ్చి పరీక్షిస్తారు. ఆ తరువాత మళ్ళీ మరికొంతమందికి వ్యాక్సిన్‌ ఇచ్చి వారి ఆరోగ్యపరిస్థితిని పరిశీలిస్తారు. ఈవిధంగా డిసెంబర్‌ నెలాఖరు వరకు వందలాదిమంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. అవన్నీ విజయవంతమైతే  ఫిబ్రవరినెలాఖరులోగా అనుమతులు తీసుకొని కొవాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.       


Related Post