కరోనా టీకాతో బ్రెజిల్‌లో వాలంటీర్ మృతి

October 22, 2020
img

బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెన్‌కా, అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ‘కొవీషీల్డ్’ పేరుతో తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రెజిల్‌లో ఓ వాలంటీర్‌కు ఆ వ్యాక్సిన్‌ ఇవ్వగా అతను మృతి చెందాడు. ఈవిషయం బ్రెజిల్ ఆరోగ్యశాఖ దృవీకరించింది. అయితే వ్యాక్సిన్‌ పరీక్షలు ఆపలేదని అవి యదాతదంగా కొనసాగుతున్నాయని తెలిపింది. 

పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కూడా కొవీషీల్డ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయబోతోంది కనుక భారత్‌లో ఆ సంస్థ అధ్వర్యంలో దాని క్లినికల్ ట్రయల్స్‌ జోరుగా సాగుతున్నాయి. బ్రెజిల్‌లో ఈ వ్యాక్సిన్‌ తీసుకొన్న వాలంటీర్ మరణించాడు కనుక ఇక్కడ క్లినికల్ ట్రయల్స్‌ నిలిపివేస్తుందా లేక కొనసాగిస్తుందా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్‌ దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలలో సజావుగా సాగుతున్నాయి. కనుక కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే దేశీయంగానే కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచదేశాలకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. 

Related Post