ఏపీలో 2 లక్షల పాజిటివ్ కేసులు

August 06, 2020
img

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంతో ప్రతీరోజు చాలా భారీగా పాజిటివ్ కేసులు కూడా బయటపడుతున్నాయి. గత 24 గంటలలో 63,686 పరీక్షలు నిర్వహించగా 10, 328 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,96,789కి చేరింది. రోజుకు 9-10,000 కేసులు నమోదవుతున్నందున గురువారం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోనుంది. ఏపీలో కరోనాబారిన పడి కొలుకొంటున్నవారు కూడా చాలా ఎక్కువే ఉండటం చాలా ఊరట కలిగిస్తున్నప్పటికీ కరోనాతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం చాలా ఆందోళనకరమే. గత 24 గంటలలో ఏపీలో 72 మంది చనిపోయారు. వారితో కలిపి ఏపీలో మొత్తం 1,753 మంది కరోనాకు బలయ్యారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం 13 జిల్లాలలో కరోనా కేసులు ఈవిధంగా ఉన్నాయి:        

సంఖ్య

జిల్లా

గత 24 గంటలలో

చనిపోయినవారి సంఖ్య

మొత్తం మరణాల సంఖ్య

గత 24 గంటలలో

నమోదైన కేసులు

మొత్తం పాజిటివ్ కేసులు

మొత్తం యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారి సంఖ్య

1

శ్రీకాకుళం

2

104

682

9636

4297

5235

2

విజయనగరం

3

72

575

7468

4638

2757

3

విశాఖపట్టణం

4

147

781

16,682

9595

6940

4

తూర్పుగోదావరి

10

205

1351

27580

12583

14,792

5

పశ్చిమగోదావరి

3

117

798

15,786

3953

11,716

6

కృష్ణ

6

198

363

9042

3012

5832

7

గుంటూరు

9

188

868

19,419

7224

12,007

8

ప్రకాశం

6

86

366

7256

2846

4324

9

కడప

0

54

604

11,493

5855

5584

10

కర్నూలు

2

223

1285

23,348

9811

13,314

11

నెల్లూరు

6

74

788

10,705

5368

5263

12

చిత్తూరు

8

143

755

14,306

6215

7948

13

అనంతపురం

10

142

1112

21,173

6768

14,263

 

ఇతర రాష్ట్రాల కేసులు

0

0

0

2461

0

2461

 

విదేశీ కేసులు

0

0

0

434

0

434


మొత్తం

72

1753

10,328

1,986,789

82,166

1,12,870

Related Post