ఇక నుంచి రాష్ట్రంలో రోజుకు 40,000 కరోనా పరీక్షలు

August 06, 2020
img

రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున ఇకపై రోజుకు 40,000 కరోనా పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుదవారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై లోతుగా చర్చించి మరికొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. 

1. ఇకపై రోజుకు 40,000 కరోనా పరీక్షలు చేయాలి. 

2. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల హోం ఐసోలేషన్ కిట్స్ పంపిణీకి సిద్దంగా ఉంచాలి. 

3. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రులలో 10,000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలి. 

4. అన్ని ప్రభుత్వాసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కూలు, గ్లౌసులు వగైరా ఏర్పాటు చేయాలి. వీటి కోసం తక్షణమే ఆర్డర్ పెట్టాలి. 

5. జిల్లా స్థాయిలో ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది కొరత ఉన్నట్లయితే తాత్కాలిక ఒప్రాతిపదికన నియమించుకొనేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం కల్పించబడింది.

6. కరోనా నివారణకు రూ. 100 కోట్లు విడుదల.

Related Post