ఫావిపిరవీర్ ట్యాబ్లెట్ ధర తగ్గించిన సన్ ఫార్మా

August 05, 2020
img

కరోనా చికిత్సకు వినియోగించే ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్ ధరను మరోసారి తగ్గించింది సన్ ఫార్మా కంపెనీ. దేశంలో కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావలనే ఉద్దేశ్యంతో ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ మాత్ర ధరనురూ.50 నుంచి రూ.35కి తగ్గిస్తున్నట్లు సన్ ఫార్మా కంపెనీ ప్రకటించింది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత స్వల్ప లక్షణాలున్నవారికి ఈ మాత్రం దివ్యౌషదంలాగా పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే దీనిని వైద్యుల సలహాతో మాత్రమే వేసుకోవలసి ఉంటుందని చెప్పారు. 


Related Post