తెలంగాణలో శనివారం 1,891 కొత్త కేసులు

August 03, 2020
img

తెలంగాణలో శనివారం కొత్తగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యధాప్రకారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 517, రంగారెడ్డిలో 181, మేడ్చల్లో 146, నిజామాబాద్‌లో 131, సంగారెడ్డిలో 111 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈసారి వరంగల్‌ అర్బన్ జిల్లాలో కూడా అత్యధికంగా 138 కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయమే.  ఒక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో శనివారం కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 66,677 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 18,547 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. శనివారం 1,088 మంది కోలుకోగా, ఆదేరోజున 10 మంది మరణించారు. రాష్ట్రంలో 47,590 కోలుకోగా, 540 మంది కరోనా బారినపడి చనిపోయారు. రాష్ట్రంలో శనివారం వరకు మొత్తం 4,77,795 కరోనా పరీక్షలు జరిపినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 


Related Post