భారత్‌లో రోజుకు 25,000 కొత్త కేసులు!

July 09, 2020
img

భారత్‌లో కరోనా వైరస్ ఇప్పుడు శరవేగంగా పెరిగిపోతోంది. ఒకప్పుడు రోజుకు 3,000 కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు రోజుకి 25,000 కొత్త కేసులు నమోదవుతున్నాయంటే దేశంలో కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. రోజుకి 25,000 కొత్త కేసులు నమోదవుతుంటే, నాలుగు రోజులలో లక్ష మంది, నెల తిరిగేసరికి 7,75,000 మంది కరోనా రోగులు తయారవుతుంటారన్న మాట! అంతమందికి కరోనా సోకుతున్నప్పుడు రోజుకి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా శరవేగంగా పెరిగిపోతుంటుంది. కనుక కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మరింత గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజలు కూడా బాధ్యతగా.. క్రమశిక్షణతో వ్యవహరిస్తూ అన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం లేకుంటే రానున్న రోజుల్లో ఇంటికో కరోనా రోగి ఉన్నా ఆశ్చర్యం లేదు.

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 24,879 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,67,296కి చేరింది. ప్రస్తుతం 2,69, 789 మంది కరోనా రోగులు వైద్యచికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,76, 378 మంది కోలుకోగా 21,129 మంది కరోనాతో మృతి చెందారని కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Related Post