భారత్‌లో రోజుకి 10,000 పాజిటివ్ కేసులు!

June 05, 2019
img

గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 9,851  కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,26,770కి చేరింది. వారిలో 1,09,462 మంది కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్లగా మరో 1,10,960 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 273 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 6,348 మంది కరోనాకు బలయ్యారు. 

కొన్ని రోజుల క్రితం దేశంలో రోజుకు 3,000 కేసులు నమోదు అవగా, వారం రోజుల వ్యవధిలో అవి రోజుకు 6-7,000కు పెరిగాయి. ఇప్పుడు రోజుకు 10,000 చొప్పున నమోదవుతున్నాయి. అంటే ప్రతీ మూడు నాలుగురోజులలో రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోందని స్పష్టం అవుతోంది. పాజిటివ్ కేసులు ఈవిధంగా రెట్టింపు అవుతుండటం ప్రమాదఘంటికలు మ్రోగుతున్నట్లుగానే భావించవచ్చు. 

Related Post