ఏపీలో కొనసాగుతున్న కరోనా జోరు

June 03, 2020
img

పొరుగు రాష్ట్రం ఏపీలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటలలో 8,066 మందికి పరీక్షలు జరుపగా వారిలో 180 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారిలో 101 మంది విదేశాల నుంచి తిరిగివచ్చినవారు, వలస కార్మికులే ఉన్నారు. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  3,971కి చేరింది. ప్రస్తుతం 967 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 2,244 మంది కోలుకొన్నారు. గడిచిన 24 గంటలలో కృష్ణా, కర్నూలు జిల్లాలలో చెరొకరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 68కి చేరినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది. 


Related Post