హైదరాబాద్‌ నీమ్స్ వైద్యులకు కరోనా?

June 03, 2020
img

హైదరాబాద్‌ నగరంలో కరోనా వైరస్‌ సోకకుండా తప్పించుకొంటూ పనులు చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో ఏకంగా 12 మంది మెడికోలకు కరోనా వైరస్‌ సోకగా, ఇవాళ్ళ పంజగుట్టలోని నీమ్స్ ఆసుపత్రిలో నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధికారికంగా దృవీకరించవలసి ఉంది. ప్రజలతో నేరుగా పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, దుకాణ యజమానులు, సిబ్బంది, నిత్యం బయట సంచరించే చిరువ్యాపారులు తదితరులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. వారి ద్వారా మళ్ళీ ఇతరులకు కూడా వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు వెళ్లినప్పుడు, మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.   


Related Post