ఏపీలో 2,874 కరోనా కేసులు…60 మంది మృతి

May 29, 2020
img

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటలలో 11,638 మందికి పరీక్షలు చేయగా వారిలో 33 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,037 మంది కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్ళగా మరో 777 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 60కి చేరింది. 

విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చినవారిలో 111 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వలస కార్మికులలో 345 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వలస కార్మికులలో 22 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి నేడు డిశ్చార్జ్ అయ్యారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. . 

ఇదివరకు జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు, కోలుకొన్నవారు, మృతుల సంఖ్యను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజూ ప్రకటిస్తుండేది. కానీ గత కే‌ఎన్ని రోజులుగా ఆ వివరాలు బయటపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బహుశః కరోనా కేసులు పెరిగిపోవడమే అందుకు కారణం అయ్యుండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోవిడ్ 19 ఇండియా సమాచారం ప్రకారం శుక్రవారం 15.51 గంటలకు ఏపీలో 13 జిల్లాలలో కరోనా కేసుల వివరాలు: 

 

          జిల్లా

 

పాజిటివ్

18/5

 

పాజిటివ్

29/5

చికిత్స పొందుతున్నవారు

 

డిశ్చార్జ్

 

 

మృతులు

 

శ్రీకాకుళం

14

21

12

9

0

విజయనగరం

8

22

18

4

0

విశాఖ పట్నం

76

99

36

62

1

తూర్పుగోదావరి

57

154

103

49

2

పశ్చిమ గోదావరి

72

83

28

55

0

కృష్ణా

382

445

122

306

17

గుంటూరు

417

465

86

371

8

ప్రకాశం

66

75

9

66

0

కడప

104

109

10

99

0

కర్నూలు

615

668

134

532

23

నెల్లూరు

157

233

86

143

4

చిత్తూరు

192

238

79

158

1

అనంతపురం

122

209

101

104

4

వలస కార్మికులు 

-

293

126

167

0

విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు  

-

111

111

0

0

మొత్తం

2,282

3,245

1,053

2,153

60


Related Post