తెలంగాణలో ఆరుగురు పోలీసులకు కరోనా!

May 22, 2020
img

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో పోలీసులు నిత్యం రోడ్లపై...కంటెయిన్మెంట్ జోన్లు, కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రుల వద్ద విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందువలన వారికి కరోనా సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. పాతబస్తీలో విధులు నిర్వర్తిస్తున్న దయాకర్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్‌కు కరోనాతో మృతి చెందడంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 

దయాకర్ రెడ్డితో కలిసి పనిచేసిన పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి కరోన పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి, వారి కుటుంబ సభ్యులకు, వారితో కలిసి పనిచేసినవారిని అందరినీ గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. 

పోలీస్ శాఖలో కరోనా కేసులు నమోదవడంతో రాష్ట్రంలో పోలీసులు, అధికారులు, సిబ్బంది అందరికీ మాస్కూలు, శానిటైజర్లు, గ్లౌజులు వగైరా అన్ని అందజేసి ఇకపై తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తుండాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి ఆర్ధికసాయం అందజేసి అన్ని విధాలా అండగా ఉంటామని డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు.

Related Post