జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కొత్త కేసులు నమోదు

May 21, 2020
img

గడచిన 24 గంటలలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి కాక 12 మంది వలస కార్మికులకు కూడా కరోనా వైరస్‌ సోకింది. వారిలో 8 మంది జగిత్యాల జిల్లాకు చెందినవారే. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,661 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 89 వలస కార్మికులున్నారు. 

ఇప్పటి వరకు 1,013 మంది కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళగా మరో 608 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నిన్న ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 40కి చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు యాదాద్రి, వరంగల్‌ రూరల్, వనపర్తి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజులుగా 25 జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిన్న రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది.


Related Post