కరోనా తాజా అప్‌డేట్స్

March 27, 2020
img

శుక్రవారం 19.30 గంటలు: దేశవ్యాప్తంగా ఈ ఒక్కరోజునే కొత్తగా 39  కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 800కు చేరింది. వారిలో 58 మంది పూర్తిగా కోలుకోగా 13 మంది మృతి చెందారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 10 కొత్త కేసులు నమోదు అవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 59కు చేరింది. వారిలో మొదటి వ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యారు. ఈరోజు ఆసుపత్రిలో చేరినవారు కాకుండా మిగిలిన 48మంది కొలుకొంటున్నారని సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న సుమారు 20,000 మందిని ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ శిబిరాలలో, వారి సొంత ఇళ్ళలోను క్వారంటైన్‌లో ఉన్నారని, వారందరి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచామని సిఎం కేసీఆర్‌ తెలిపారు.  

చాలా దిగ్బ్రాంతి కలిగించే వార్త ఏమిటంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా వైరస్‌ సోకింది. తనకు కరోనా సోకినట్లు బోరిస్ జాన్సన్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. బ్రిటిష్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్‌కాక్‌కు కూడా కరోనా బారినపడ్డారు. కొద్ది సేపటిక్రితమే బ్రిటన్ ప్రభుత్వం ఈ వార్తలను దృవీకరించింది. కరోనా సోకడంతో వారిరువురూ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితమే బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబిత్ కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ (71)కి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో ఇంత ఉన్నతస్థాయి నేతలకు కరోనా సోకడం చాలా ఆశ్చర్యకరమే.   

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,29,614కు చేరింది. వారిలో 1,21,454 మంది కొలుకొంటునట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. నేటి వరకు మొత్తం 23,714 మంది కరోనాతో మృతి చెందారు.

Related Post