తెలంగాణలో కరోనా...అప్‌డేట్స్

March 27, 2020
img

ఈ నెల 24వరకు విదేశాల నుంచి తెలంగాణకు మొత్తం 77,045 మంది రాగా వారిలో 17,283 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. వారిలో చాలా మందికి క్వారంటైన్ శిబిరాలకు తరలించడమో లేదా గృహనిర్బందంలో ఉంచడమో చేశారు. క్వారంటైన్ శిబిరాలలో ఉన్న వారిలో 699 మందికి కరోనా లేదని నిర్ధారణ కావడంతో వారిని ఇళ్లకు పంపించివేశారు. మరో 113 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు రావలసి ఉంది. ఇప్పటివరకు 856 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 45 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో గాంధీ ఆసుపత్రిలో 33 మంది, ఛాతి ఆసుపత్రిలో 10 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా సోకిన మొట్టమొదటి వ్యక్తి చికిత్స అనంతరం కోలుకొని కొన్ని రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు.    

దోమలగూడలో ఓ వైద్య దంపతులకు కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే వారిరువురినీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించి, వారి నివాసంలో పరిసర ప్రాంతాలలో కీటకనాశిని మందులను పిచ్చికారి చేసి కరోనా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Related Post