చిట్యాల ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం...తల్లీ బిడ్డ మృతి

August 28, 2019
img

ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వలన ఎంతమంది ప్రాణాలు పోతున్నా వారి నిర్లక్ష్యం ఏమాత్రం తగ్గడంలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండల కేంద్రంలో గల సివిల్ ఆసుపత్రి సిబ్బంది అవగాహనాలోపం లేదా నిర్లక్ష్యం కారణంగా బుదవారం సాయంత్రం తల్లీ బిడ్డ చనిపోయారు. 

జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలో ఎస్.పేట గ్రామానికి చెందిన కవిత అనే నిండు గర్భిణికి నొప్పులు మొదలవడంతో కుటుంబ సభ్యులు ఆమెను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో నర్సులే ఆమెకు సహజసిద్దంగా ప్రసవం చేయడానికి ప్రయత్నించారు. కానీ వారి అవగాహనాలోపం కారణంగా ఆమె పరిస్థితి విషమించి టేబుల్ మీదే చనిపోయింది. ఆమెతో పాటు ఆమె బిడ్డ కూడా చనిపోయింది. మృతురాలి బందువులు తీవ్ర ఆగ్రహంతో ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.  పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆసుపత్రిలో ఉండవలసిన గైనకాలజిస్ట్ ఆ సమయంలో బయటకు ఎందుకు వెళ్లారు? రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణం వైద్యుని నిర్లక్ష్యమా లేక సిబ్బంది తొందరపాటు, అవగాహనారాహిత్యమా? ఇరువురి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారిప్పుడు? అని మృతురాలి బందువులు ప్రశ్నిస్తున్నారు. 

Related Post