ఏపీలో కిడ్నీ పేషెంట్లకు నెలకు 10,000 పింఛను

June 01, 2019
img

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ పేషెంట్లను కలిసినప్పుడు వారి సమస్యలపై స్పందిస్తూ తాను అధికారంలోకి రాగానే నెలకు రూ.10,000 పింఛను ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంటూ ప్రస్తుతం నెలకు రూ.3,500 ఇస్తున్న పింఛనును ఈ నెల1వ తేదీ నుంచి రూ.10,000 చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంలోనే 4,000 మందికి పైగా ఉన్నారు. వారందరికీ రెండు కిడ్నీలు చెడిపోవడంతో వాటిని మార్చుకొనే ఆర్ధికస్తోమత లేక ప్రతీనెల వేలరూపాయలు ఖర్చుచేసి డయాలసిస్ యంత్రాల ద్వారా రక్తశుద్ది చేయించుకొంటున్నారు. ఈ వ్యాది కారణంగా వారు ఏ పని చేసుకోలేక దయనీయమైన జీవితాలు గడుపుతున్నారు. వారందరికీ నెలకు రూ. 10,000 పింఛను మంజూరు చేసి జగన్‌మోహన్‌రెడ్డి కొండంత అండగా నిలబడ్డారు.         


Related Post