మధులిక ఆరోగ్యపరిస్థితి: తాజా సమాచారం

February 09, 2019
img

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్ పేట యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు పొందిన మధులిక (17) పూర్తి స్పృహలోకి వచ్చిందని, ఆమె ఆరోగ్యపరిస్థితి మెరుగుపడిందని కనుక ఆమెను వెంటిలేటర్‌ను తొలగించామని వైద్యులు తెలిపారు. చికిత్సకు ఆమె శరీరం బాగా స్పందిస్తుంనందున ఆమె త్వరగానే కోలుకోవచ్చునని తెలిపారు. నిందితుడు ఆమెపై తుప్పు పట్టిన కత్తితో దాడి చేసినందున ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఇంకా పొంచి ఉందని కనుక ఆమెకు ఇన్ఫెక్షన్స్ సోకకుండా అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమెకు శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు:       

డాక్టర్‌ శ్రీనివాస్‌ భొట్ల: న్యూరోసర్జన్‌

డాక్టర్‌ చంద్రమౌళి: ప్లాస్టిక్‌ సర్జన్‌

డాక్టర్‌ ప్రకాశ్: వాస్క్యూలర్‌ సర్జన్‌

డాక్టర్‌ సాయిబాబా: జనరల్‌ సర్జన్‌

డాక్టర్‌ ప్రసీద్‌: ఆర్థోపెడిక్‌ సర్జన్‌

వీరు కాక ఇంకా అనెస్తిషియన్లు, మరికొందరు వైద్య నిపుణులు, ఆపరేషన్ ధియేటర్ సిబ్బంది మధులికకు శస్త్రచికిత్సలలో పాల్గొన్నారు. ఆమెకు వరుసగా 5శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పుర్రె, వెన్నుపూస, కండరాలు, చేతులకు చాలా క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు. ఒకటి రెండు రోజులలోనె ఆమె మరింత కోలుకోవచ్చునని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Post