గ్లోబల్ ఆసుపత్రిలో రోగి బందువులు వీరంగం

December 28, 2018
img

హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ఒక రోగి చనిపోవడంతో రోగి బందువులు సోమవారం ఆసుపత్రిలో అద్దాలు పగులగొట్టి విద్వంసం చేశారు. 

నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన షామీన్ బేగం(45)ను ఆమె కుటుంబ సభ్యులు డిసెంబరు 18న గ్లోబల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు స్వైన్ ఫ్లూ కూడా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు దానికీ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. డిసెంబరు 24న ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేస్తుండగా హటాత్తుగా ఆమెకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో హృద్రోగ నిపుణులు వచ్చి ఆమె ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ దురదృష్టశాత్తు ఆమె మరణించింది. 

ఈ విషయం తెలుసుకొన్న ఆమె కుమారుడు మొహిఉద్దీన్ ఆలీ ఖాన్, అతని ఇద్దరు సోదరులు మీర్ బర్కత్ ఆలీ ఖాన్, మీర్ ముస్తాఫా ఆలీ ఖాన్, వారి బావమరిది మోహిసిన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఆసుపత్రిలో ఫర్నీచర్, అద్దాలు పగులగొట్టి విద్వంసం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై కూడా దాడి చేశారు.

దాంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సైఫాబాద్ పోలీసులు హుటాహుటిన వచ్చి వారిని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. కానీ వారు నలుగురు పోలీసులను కూడా బలవంతంగా బయటకు గెంటేశారు. దాంతో మరికొంత మంది పోలీసులు అక్కడకు చేరుకొని వారు నలుగురిని అదుపులోకి తీసుకొని వారిపై తెలంగాణ మెడికర్ సర్వీసస్ చట్టం 2018లోని సెక్షన్:4 క్రింద కేసు నమోదు చేశారు. అలాగే వారి ఫిర్యాదు మేరకు గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపై కూడా సెక్షన్:174 క్రింద మరో కేసు నమోదు చేశారు. మొహిఉద్దీన్ సోదరుల ఫిర్యాదు మేరకు షామీన్ బేగం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి తరలించారు.


Related Post