సూర్యాపేటలో క్షయవ్యాధి పరీక్షాకేంద్రం

June 20, 2018
img

సూర్యాపేట జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ‘సిబినాట్ ల్యాబ్’ అనే ఉచిత  క్షయవ్యాధి పరీక్షాకేంద్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి బుదవారం ప్రారంభించారు. రూ.40 లక్షల ఖరీదు చేసే అత్యాధునిక పరికరాలను సిబినాట్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. సాధారణంగా క్షయవ్యాధి నిర్ధారణకు రెండునెలలు సమయం పడుతుంది కానీ సిబినాట్ ల్యాబ్ లో కేవలం రెండు గంటలలోనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బయట ప్రైవేట్ ఆసుపత్రులలో క్షయవ్యాధి పరీక్షలకు సుమారు రూ.8,000 వరకు వసూలు చెస్తుంటారు కానీ సిబినాట్ ల్యాబ్ లో ఉచితంగా చేస్తారు. కనుక సూర్యాపేట పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నవారు ఇకపై క్షయవ్యాధి నిర్ధారణకు హైదరాబాద్ వెళ్ళనవసరంలేదు. ఒక ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఇంత శ్రద్ధ చూపడం గొప్ప విషయమే. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి, ఆనందం సాధ్యం అవుతుందని సిఎం కెసిఆర్ నమ్మకాన్ని ఎవరైనా కాదనగలరా?           


Related Post