అది మంచి ఆలోచనే...

June 14, 2018
img

తెలంగాణాలో విజయవంతంగా అమలవుతున్న కెసిఆర్ కిట్స్ పంపిణీ పధకంలో ప్రభుత్వం చిన్న మార్పు చేసింది. ఈ పధకాన్ని మొదటి రెండు కాన్పులకే వర్తింపజేస్తోంది. దానిని అలాగే కొనసాగిస్తూనే ఏజన్సీ ప్రాంతాలలో నివసించే చెంచు, తోటి, కొండ్రెడ్డి, కోలమ్ తెగలవారికి మాత్రం మూడవ కాన్పుకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఏజన్సీ ప్రాంతాలలో పౌష్టికాహార లోపం, వ్యాధుల కారణంగా బాల్యంలోనే అనేకమంది పిల్లలు మరణిస్తున్నారు. ఆ కారణంగా ఆ నాలుగు తెగల జనాభా క్రమంగా తగ్గిపోతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వారి కోసం మూడవ కాన్పుకు ఈ పధకాన్ని పొడిగించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని రాష్ట్ర  వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

ఇది చాలా మంచి ఆలోచనే. ఈరోజుల్లో పల్లెలలో కూడా వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి కానీ ఏజన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీలు, గిరిజనులకు వైద్యం ఇంకా అందుబాటులోకి రాలేదని ఇది స్పష్టం చేస్తోంది. కనుక ఏజన్సీ ప్రాంతాలలో శిశు మరణాలు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని నివారించేందుకు ప్రభుత్వం సమాంతరంగా చర్యలు చేపడితేనే సత్ఫలితాలు లభిస్తాయి.


Related Post